
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో పరమశివుని విగ్రహాన్ని ప్రతిష్టించుకునేందుకు హిందువులు సమాయత్తమయ్యారు. తమ సొంతంగా విరాళాలు సేకరించిన డబ్బుతో పరమశివుని విగ్రహాన్ని శనివారం గ్రామానికి తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో గ్రామంలోని క్రైస్తవులు తమకు శివుని ముఖం చూడటం ఇష్టం లేదని.. ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీలులేదని ఆందోళన చేశారు. రోడ్డుపైన టెంటు వేసుకుని లారీలో ఉన్న పరమశివుని విగ్రహాన్ని అడ్డగించారు. ఈక్రంమలో రెండు వర్గాలతోనూ రెవెన్యూ, పోలీసు అధికారులు చర్చలు జరిపి సోమవారం విగ్రహ ప్రతిష్టకు అనుమతి ఇచ్చారు. బందోబస్తు మధ్య విగ్రహాన్ని శ్మశానవాటికకు తరలించగా, వేదమంత్రాలతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే మరో వర్గం కోటపాడు ఏడీబీ రోడ్డుపై రాస్తారోకో చేయడానికి యత్నించగా.. వెంటనే అనపర్తి సీఐ వి. శ్రీనివాస్, ఎస్సై టి. రామకృష్ణ సిబ్బందితో వారిని అడ్డుకున్నారు. కొందరిని అరెస్టు చేసి పోలీసు స్టేషషన్‌కు తరలించారు. డీఎస్సీ నాయుడు పరిస్థితిని సమీక్షించారు. స్థానికేతరులు గ్రామంలోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. దీనిపై పలువురు స్పందిస్తూ.. హిందువులపై ఎలాంటి రాజ్యంగం అమలవుతుంది అసలు.. కనీసం దేవుడిని కొలిచే అవకాశం కూడా ఈ రాష్ట్రంలో తమకు లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మతాన్ని ఆచరించే హక్కు కూడా హిందువులకు లేదా అని ప్రశ్నిస్తున్నారు.
https://fb.watch/iovoYWL_7V/?mibextid=2Rb1fB





