News

ఐటం సాంగ్‌లా దైవ మంత్రం.. దేవిశ్రీప్రసాద్‌పై కరాటే కల్యాణి, హిందూ సంఘాల ఫిర్యాదు(వీడియో)

374views

భాగ్యనగరం: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సినీ నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు బుధవారం సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాయి. దేవి శ్రీప్రసాద్‌.. ఓ పరి అనే  నాన్‌-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోలో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లా చిత్రీకరించారని కరాటే కల్యాణి తన ఫిర్యాదులో పేర్కొంది.

 

పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన సంగీత దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన డీఎస్పీ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలన్నారు. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని… లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి