News

ప్రపంచంలోనే ఎత్తయిన శివయ్య విగ్రహం!

561views

నాథ్‌ద్వారా: రాజస్తాన్‌ నాథ్‌ద్వారాలో నెలకొల్పిన ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం నేటి నుంచి ప్రజలకు దర్శనమివ్వనుంది. 369 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని సీఎం గహ్లోత్‌ ఆవిష్కరించనున్నారు. గంటలకు 250 కి.మీ వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా, 250 ఏళ్ళపాటు నిలిచేలా దీనిని నిర్మించారు. 20 కి.మీ. దూరం నుంచి కూడా ఈ విగ్రహం కనిపిస్తుంది. మూడు వేల టన్నుల ఇనుము, 2.5 లక్షల టన్నుల కాంక్రీట్‌ ఉపయోగించి పదేళ్ళలో దీనిని నిర్మించారు.

Source: Way2news

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి