News

చైనా రుణ యాప్​లపై ఈడీ కొరడా.. రూ.78 కోట్లు స్వాధీనం!

321views

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో సులభతర అప్పులు అని చెబుతూ ఎక్కువ వడ్డీలను దండుకుంటున్న చైనాకు చెందిన రుణ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కొరడా ఝులిపించింది. రుణ యాప్‌లకు చెందిన రూ. 78 కోట్ల రూపాయలను వాటి పేమెంట్‌ గేట్‌వేల నుంచి స్వాధీనం చేసుకుంది. బెంగళూరులోని 6 గేట్‌వే కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు జరిపింది. రుణ యాప్‌లకు సంబంధించిన కీలక డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకుంది. ఆర్థిక దోపిడీ, మనీ లాండరింగ్‌ కేసులు నమోదు కింద రూ.78కోట్లు సీజ్‌ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి