News

డబ్బు కోసం చైనా పైలట్లకు శిక్షణ!

367views

బ్రిటన్‌: బ్రిటన్‌ మిలటరీకి చెందిన మాజీ పైలట్లు చైనాకు సాయం చేస్తున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్‌ రక్షణ శాఖే స్వయంగా వెల్లడించింది. దాదాపు 30 మంది మాజీ పైలట్లు చైనా నుంచి భారీగా సొమ్ము తీసుకొని వారి నైపుణ్యాలను పీఎల్‌ఏకు ధారపోస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకోసం చైనా అత్యంత ఆకర్షణీయమైన ప్యాకేజీలను ఇస్తోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. కొన్ని ప్యాకేజీల కింద ఏకంగా 2,37,911 యూరోలను ఆఫర్‌ చేస్తోందని పేర్కొన్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల విమానాల లోటుపాట్లు, బలాబలాలు తెలుసుకొనేందుకు బ్రిటన్‌ మాజీ పైలట్లను చైనా వాడుకొంటోంది. తైవాన్‌ సంక్షోభం తలెత్తితే ఈ సమాచారం డ్రాగన్‌కు ఉపయోగపడుతుంది. ఈ సమాచారం చైనా వాయుసేన వ్యూహాలు సిద్ధం చేసుకొని సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి