News

సాక్షులను బెదిరిస్తున్నారు – నీరవ్ మోడీకి దొరకని బెయిలు – క‌ష్టాల్లో నీర‌వ్ మోడీ..!

551views

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.13,700 కోట్లు  ఎగ‌వేత‌ కుంభకోణంలో నిందితుడు, వ‌జ్రాల‌ వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ విచారణ కోసం శుక్రవారం రెండోసారి వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను మ‌రోసారి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తిరస్కరించింది. అతను పీఎన్‌బీని మోసం చేశాడని తెలిపే ఆధారాలను వెంటతీసుకుని ఈడీ, సీబీఐ అధికారుల బృందం నిన్న‌ లండన్‌కు చేరుకుంది. ఆ ఆధారాలన్నిటినీ అక్కడి న్యాయస్థానం ముందుంచింది.

నీరవ్ మోడీ దర్యాప్తులో భారత ఏజెన్సీలకు సహకరించడం లేదని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ఆరోపించింది. పైగా సాక్షులను చంపేస్తానని బెదిరిస్తున్నందువల్ల బెయిల్ ఇవ్వరాదని కోర్టును కోరారు. బయటికొస్తే నీరవ్ మోడీ సాక్ష్యాలను నాశనం చేయడం, సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీరవ్ మోడీకి బెయిల్ ఇస్తే ఆయన దేశం వదిలి పారిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అతని బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.