News

`ఆదిపురుష్’ చిత్రం యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

343views

న్యూఢిల్లీ: ‘ఆదిపురుష్‌’ సినిమాపై వివాదాలు ముసురుకుంటున్నాయి. ప్రభాస్‌ రాఘవుడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ సినిమా విడుదలకు ముందే వివాదాలకు ఆజ్యం పోస్టున్నది. హిందూ దేవతలను అవమానించేలా ఈ సినిమా చిత్రీకరణ జరిపారంటూ పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి.

రాముడి, రావణాసురుడి పాత్రలను అపహాస్యం చేసేలా చిత్రాన్ని రూపొందించారని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అయోధ్య రామాలయం పూజారి కూడా సినిమా విడుదల కాకుండా చూడాలన్నారు. వివాదాలు కొనసాగుతుండగానే తాజాగా ఢిల్లీ హై కోర్టు చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది.

ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఆశిష్ రాయ్ పిటిషన్ దాఖలు చేశారు. చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్‌లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మూవీ విడుదల కాకుండా చూడాలని కోరారు. దీంతో ఢిల్లీ హై‌కోర్టు మూవీ యూనిట్‌కు నోటీసులు పంపించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి