
ఎన్నికల సందర్భంగా ఏ ఒక్క రాజకీయ పక్షం పట్ల మీడియా పక్షపాతంతో వ్యవహరించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పత్రికా ప్రముఖులకు సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ ఉమేష్ సిన్హా మాట్లాడుతూ సోషల్ మీడియా వినియోగదారులు కూడా తమకు తాముగానే విలువలను పాటించాలని హితవు చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్, యాచులి, అలోంగ్ (తూర్పు) నియోజకవర్గాలలో ముగ్గురు BJP అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎలక్షన్ కమీషన్ ఈ సందర్భంగా ప్రకటించింది. మరో డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ చంద్ర భూషణ్ కుమార్ మాట్లాడుతూ దిరాంగ్ స్తానానికి మూడు నామినేషన్లు దాఖలు కాగా తర్వాత ఇద్దరు అభ్యర్ధులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని తెలిపారు. అలాగే మిగిలిన రెండు నియోజకవర్గాలకు కూడా చెరో రెండు నామినేషన్లు దాఖలు కాగా, రెండు నియోజకవర్గాలలోనూ ఒక్కొక్క నామినేషన్ పరిశీలన తర్వాత తిరస్కరణకు గురి అయ్యాయని తెలిపారు.
ఈ ఎన్నికలలోమొదటి విడతలో 616 నామినేషన్లు, రెండవ విడతలో 631 నామినేషన్లు నమోదయ్యాయి. గడచినా నాలుగయిదు వారాల్లోఒక కోటి కొత్త వోటర్లు తమ ఓట్లు నమోదు చేయించుకున్నారని తెలిపారు. మొదటిసారిగా లోక్ సభ ఎన్నికలలో వివి ప్యాట్లు వాడడం జరుగుతుందని కూడా తెలిపారు.





