News

దెబ్బకు దెబ్బ – 12 మంది పాక్ సైనికులు హతం – తగ్గేదే లేదంటున్న భారత సైన్యం.

998views

నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ కు భారత్ ధీటుగా బదులిచ్చింది. ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులతో కలిపి 12 మంది పాక్ సైనికులను మన సైన్యం మట్టుబెట్టింది. భారత్ పాక్ సరిహద్దులలోని సుందర్బని సెక్టార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.  22 మందికి పైగా పాక్ సైనికులు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. Mi – 17 హెలికాప్టర్ల సాయంతో పాక్ మృత దేహాలను సంఘటనా స్థలం నుంచి రావల్పిండికి తరలించుకుపోయింది. భారత సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించడంతో పాక్ సైన్యం వణికిపోయింది. తమ జాతీయ జెండాలను తలకిందులు చేసి ఓటమిని అంగీకరించింది.

నిజానికి బాలాకోట్ దాడుల తర్వాతైనా బుద్ది తెచ్చుకుంటుందనుకుంటే పాక్  బుద్ది మారలేదు. పాక్ అను నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే వుంది. తత్కారణంగా సుందర్బని సెక్టర్లో ఒక భారత సైనికుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాక్ సైనికులను మట్టుబెట్టడం ద్వారా పాక్ కు భారత్ మరోసారి బుద్ది చెప్పినట్లయింది.