News

వారు గతించినా…. వారి జ్ఞాపకాలు మనతోనే వుంటాయి.

927views

నంద్యాలకు చెందిన మన జ్యేష్ట స్వయంసేవక్ ఓ సి వెంకటస్వామి గారి శ్రద్దాంజలి కార్యక్రమం 17.03.2018 ఆదివారం ఉదయం నగర సాంఘిక్ లో జరిగింది . స్వయం సేవకులు అలాగే వివిధ క్షేత్రంలో పనిచేస్తున కార్యకర్తలు వారితో ఉన్న అనుభవాలను కలసి పని చేసిన జ్ఞాపకాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వారి జివితాన్ని సంఘానికి అర్పించిన వ్యక్తి.

ఆరెస్సెస్ కర్నూలు విభాగ్ సహ సంఘచాలక్ డాక్టర్ ఉదయ శంకర్ గారు  మాట్లాడుతూ భారతమాత సేవలో ఆనందాన్ని పొందినటువంటి వారు శ్రీ అవుకు చిన్న వెంకట స్వామి గారు (O C వెంకట స్వామి). 1938వ సంవత్సరంలో జన్మించారు వారు స్వస్థలం నంద్యాల . నంద్యాల లో మునిసిపల్ హై స్కూల్ లో హిందీ పండితునిగా వారు పనిచేసేవారు. సంఘ కార్యక్రమంలో వారు, కటకం నారాయణ గారు ముందు ఉండి పని చేసే వారు .అందరు వారిని “వెంటస్వామి” అని పిలిచే వారు. అనేక మంది కొత్త స్వయం సేవకులను సంఘ శాఖలకు పరిచయం చేసేవారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వలన వారు హైదరాబాదు లో ఉన్న అల్లుడు దగ్గర వుంటున్నారు. 12.03.2019 మంగళవారం తెల్లవారుఝామున 3:30 నిమిషాలకి స్వర్గస్తులైనారు. వారు మన మధ్య లేకున్నాఅనేక మంది కార్యకర్తల హృదయాలో నిలిచి ఉంటారు అని తెలిపారు.

విభాగ్ కార్యకారిణి సభ్యులు శ్రీ సుబ్బ లక్ష్మయ్య గారు మాట్లాడుతూ వెంకట స్వామి గారు నాకు మేన మామగారు వారిని స్మరించుకుంటూ ఈ రోజు శ్రద్ధాంజలి సభ కార్యక్రమంలో  స్వయం సేవకులు , వారితో కలసి పని చేసిన కార్యకర్తల చూడడం, వారితో ఉన్న అనుభవాలని అందరితో పంచుకోవడం మా అదృష్టం. వారు మాకు మేన మామ గారు. వారికి పిల్లలు లేక పోయినా మమ్మలి సొంత పిల్లల్లా పెంచి అన్నీ సమకూర్చే వారు. అందరం కలసి ఒకే ఇంటిలో ఉండే వాళ్ళము. ణా సంఘ పరిచయం వారి ద్వారానే జరిగింది అని తెలిపారు.

బి.జె.పి కార్యకర్త  శ్రీ మేడా మురళీధర్ మాట్లాడుతూ ఓ సి వెంకట స్వామి గారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. నంద్యాల నగరం మునిసిపల్ హై స్కూల్ విద్యార్థులకు చక్కటి బోధన చేస్తూనే ప్రతి రోజు నియమం తప్పకుండ సంఘ శాఖలో  ఉదయం 6:00 గంటలకల్లా ఉండే వారు స్వయంగా సంఘ శాఖ నిర్వహణ (ముఖ్య శిక్షక్ ) చేసేవారు . సంఘ నిష్ట, సమయ పాలన తు. చ తప్పకుండా శాఖ నిర్వహణ జరిగేది. ఆయనతో నాకు ఉన్న మంచి అనుబంధం ఉండేది అని స్వర్గీయ వెంకటస్వామి గారితో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.

మరో బి.జె.పి కార్యకర్త శ్రీ నిచ్చెనమెట్ల రాధాకృష్ణ మాట్లాడుతూ   స్వర్గీయ వెంకటస్వామి  శ్రీ కటకం నారాయణ గారి తరువాత అంతే ఉత్సాహం , ప్రీరణతో సంఘ శాఖలు, కార్యక్రమాలు చేసేవారు. పనివిషయం లో వెనుకకు అడుగు వేయకుండా అందరితో కలసి పని చేస్తూ చేయించే వారు  అని తెలిపారు.

శ్రీ శారద విద్యాపీఠం శ్రీ హిమనాథ్ గారు మాట్లాడుతూ శ్రీ వెంకట స్వామి గారు మన మధ్య లేకున్నా వారు మన మనసులో ఎప్పుడు చిరస్మరణీయులు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు అయివుండి కూడా సంఘ పై ఎమర్జెన్సీ వచ్చినప్పుడు సహచర ఉద్యోగులు “మీరు చాల మంచి వ్యక్తి, స్నేహ భావం కలవారు,  సంఘ పై నిషేధం ఉంది,  మీరు సంఘ శాఖలకి వెళ్ళవద్దు” అని చెప్పేవారు వారు నవ్వుతూ “నన్ను ఉద్యోగం నుండి తప్పించినా సరే నేను మాత్రం సంఘ శాఖ మానను.” అని చెప్పారు. పోలీసు వారు అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు కూడా పోలీసు అధికారి వారితో “మీరు ప్రభుత్వ ఉద్యోగులు. మేమూ ఉద్యోగులమే కనుక ఒక పేపర్ పైన RSSతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని రాసి ఇవ్వండి మిమ్మలి వదిలేస్తాం.” అనేవారు. వారు ఒప్పుకోలేదు. మనసులో ఎలాంటి కల్మషం లేని వ్యక్తి శ్రీ వెంకట స్వామి గారు అని తెలిపారు.

ఆరెస్సెస్ జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ వెంకట స్వామి గారిది చాలా సున్నితమైన మనస్సు, ఆలోచన విధానము. సంఘ కార్యక్రమంలో ఎలా ఉంటారో బయట కూడా ఏ సంఘటన జరిగిన కూడా నిదానంగా అలోచించి పరిష్కరించే వారు. వారి ముఖం లో ఎప్పుడూ కోపం అనేది ఉండేది కాదు . అందరితో కలసి ప్రేమగా మాట్లాడే వారు అని తెలిపారు.

నగర ధర్మజగారణ ప్రముఖ్ శ్రీ చింతలపల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ ఓ. సి. వెంకట స్వామి గారు మా ఇంటి ఎదురుగానే ఉండే వారు. వారు ఉపాధ్యాయులుగా పని చేస్తూ ప్రతి రోజు మమ్మలి సంఘ శాఖకు పిలుచుకొని వెళ్ళేవారు. మేము ఈ స్థాయి ఉండడానికి కారణం కటకం నారాయణ గారు ,వెంకట స్వామి గార్లే అని తెలిపారు.

Rtd RTC ఉద్యోగి శ్రీ గుణకర్ మాట్లాడుతూ వారు మా గురువు గారు. నన్ను విద్యాపీఠంలో చేర్పించి విద్యను అందించినటువంటి వారు ఈ రోజు లేక పోవడం చాల బాధకరం అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

పాలూరి సుబ్బారావు మాట్లాడుతూ వ్యాపారరీత్యా మేము నంద్యాల నూనెపల్లె వచ్చేవాళ్ళము. మా మిత్రుడి దగ్గర వెంకటస్వామి గారు కూర్చొని మాట్లాడుతూ ఉండే వారు. అప్పటి నుంచి నాకు, వారికీ మంచి పరిచయం అని తెలిపారు.

మరి కొంత మంది కార్యకర్తలు వారితో తమకు వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వయంసేవకులు, సంఘమిత్ర చిన్నారులు ,కమిటి సభ్యులు, వివిధ క్షేత్ర కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొనారు.