News

కమలం టీంలోకి క్రికెటర్ గంభీర్

1.1kviews

ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్ కాషాయ కండువా కప్పుకున్నారు. కమల దళంలో చేరిపోయారు. డిల్లీలోని భాజపా కార్యాలయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్ ల సమక్షంలో పార్టీలో చేరారు. గౌతం గంభీర్ గతంలో అనేక సేవా కార్యక్రమాలలో తన సాయాన్ని అందించడం, అమర సైనికుల కుటుంబాలకు బాసటగా నిలవటం తెలిసిందే. అభిమానుల చేత సోషల్ మీడియాలో దేశ భక్తుడిగా కీర్తింపబడే గంభీర్ తన అభిరుచికి తగ్గట్లుగానే దేశభక్త భాజపాని ఎంచుకున్నట్లున్నారని అభిమానులు భావిస్తున్నారు.