News

కాన్పూర్ : 15 మంది – వందల మందిని అడ్డుకున్నారు

1kviews

* వందలాది మంది మతోన్మాదుల దాడిని అడ్డుకుని బస్తీని, బస్తీలోని మహిళల్ని కాపాడుకున్న 15 మంది హిందూ యువకులు

* ఆ యువకులకి సర్వత్రా ప్రశంశలు

* హీరోలుగా కీర్తిస్తున్న సోషల్ మీడియా

కాన్పూర్ లోని ఆ బస్తీలోని వీధిలో మొత్తం 150 కుటుంబాలకు చెందిన 600 మంది హిందువులు. గడచిన శుక్రవారం మధ్యాహ్నం షుమారు 2 గంటల సమయం. బస్తీలోని మగాళ్ళంతా కూలీ పనులకు చిన్న చిన్న షాపుల్లో ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఇండ్లలో ఆడాళ్ళే ఉన్నారు. శుక్రవారం కదా? మశీదుల్లో ప్రార్థనల అనంతరం కొంతమంది ముస్లిముల గుంపు హిందువులపై దాడులకు దిగారు.

ఆరోజు పనులకు వెళ్లకుండా ఇళ్ళలో ఉన్నది కేవలం 15 మంది కుర్రాళ్ళు మాత్రమే. అంతా చిన్నాచితక పనులుచేసుకుని కుటుంబాలను పోషించుకునే బాధ్యతగల హిందూ కుర్రాళ్ళు. అరుపులు కేకలతో, మారణాయుధాలు చేతబట్టి వస్తున్న గుంపును చూసి అప్రమత్తమయ్యారు. పోలీసులకి ఫోన్ చేశారు. కానీ పోలీసులు వచ్చేలోగా వచ్చిన అల్లరి మూకలు ఆగరుగా? వారినెలాగైనా ఆపాలనుకున్నారు. ఉన్న 15 మంది కుర్రాళ్ళూ కూడబలుక్కుని కర్ర, కత్తి, గునపం, పార, రాళ్ళు చేతికి దొరికిన వస్తువు పట్టుకుని బస్తీ మొగదల గిరి గీసి నిలుచున్నారు.

అడుగు ముందుకు వేసినవాణ్ని వేసినట్టు చావబాదారు. తలకాయలు పగులగొట్టారు. బలం కొద్దీ రాళ్ళు విసిరి దగ్గరకు రాకుండా తరిమి కొట్టారు. అవతల వందల మంది. ఇవతల కేవలం 15 మంది. కానీ వాళ్ళెవరూ వీళ్ళ ధాటికి ఆగలేకపోయారు. అడుగు ముందుకు వేయలేకపోయారు. అలా ఓ గంటపాటు వాళ్ళు ఆ అల్లరి మూకను నిలువరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) పోలీసులు వచ్చేవరకు వాళ్ళని అడుగు ముందుకు వేయనివ్వలేదు.

ఘటన తరవాత Asian News International (ANI) విలేఖరులు అడిగారు “మీరు ఎందుకు అలా ప్రాణాలకు తెగించి మరీ ఈ బస్తీలోని హిందువులను కాపాడారు? వీళ్ళంతా మీ చుట్టాలు కూడా కాదుకదా?” అని. దానికి వాళ్ళ సమాధానం…. “వీళ్ళంతా మా హిందూ సోదర సోదరీమణులు. వాళ్ళని అలా ఎలా వదిలేస్తాం? వాళ్ళను రక్షించటం మా కర్తవ్యం.” అని.

హిందువుల శక్తిని, సామర్థ్యాన్ని, తెగింపుని, ధైర్య సాహసాలను, పోరాట పటిమను ఈ ఘటన వెల్లడి చేస్తోందని, నిజానికి హిందువు తన అస్తిత్వాన్ని కాపాడుకోడానికి తెగించి నిలబడితే హిందువులను ఢీకొట్టే శక్తి ఈ ప్రపంచంలోనే లేదని, ఇది చరిత్ర చెప్పిన నిజమని, అందుకే ఇన్ని వందల సంవత్సరాలుగా ఎన్ని దాడులు, దురాక్రమణలు, కుట్రలు, కుతంత్రాలు జరిగినా, జరుగుతూనే ఉన్నా హిందువు తట్టుకొని నిలబడగాలిగాడని కొందరు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.