
ప్రయాగ్‌రాజ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పారుశుధ్య కార్మికుల పాదాలు కడిగారు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ అభర్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు మహిళల సహా ఐదుగురు పారుశుధ్య కార్మికుల కాళ్లు కడిగారు. ఐదుగురు పారుశుధ్య కార్మికులను కుర్చీల పైన కూర్చోబెట్టి, వారి కాళ్లను పళ్ళెంలో ఉంచి చెంబు పట్టుకొని నీళ్లతో కడిగారు. మొత్తం ఐదుగురి కాళ్లు కడిగారు. అనంతరం తువ్వాలుతో వారి కాళ్లు కూడా తుడిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రయాగ్‌రాజ్‌లో అర్ధ కుంభభమేళా ఆరంభమైనప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు పారుశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. సెలవు లేకుండా పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ వారికి పాదాలు కడగాలని, సన్మానించాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ కుంభమేళాలో పరిసరాలను శుభ్రం చేస్తున్న స్వచ్చగ్రహిలు (కుంభమేళాలో శుభ్రం చేస్తున్నవారు) మొత్తం భారతదేశానికి స్ఫూర్తిదాయకం అని చెప్పారు.





