
496views
-
బెంగళూరు మహానగర పాలిక సంచలన నిర్ణయం
బెంగళూరు: బెంగళూరు నగరంలో మాంసం విక్రయాలను నిషేధించారు. ఈ నెల 10వతేదీన ఆదివారం(రేపు)రామ నవమి సందర్భంగా ఏప్రిల్ 10న బెంగళూరు నగరం అంతటా మాంసం విక్రయాలను నిషేధిస్తూ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఉత్తర్వులు జారీ చేసింది. మాంసం దుకాణాలతోపాటు కబేళాలను కూడా మూసివేయనున్నారు.
బీబీఎంపీ పరిధిలోని మాంసం దుకాణాలు, కబేళాలు ఆదివారం మూసి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో మహా శివరాత్రి, గణేష్ చతుర్థి నాడు మాంసం విక్రయాలను నిషేధించారు. నవరాత్రి పండుగ సందర్భంగా ఈ నెల నాలుగోతేదీ నుంచి 11వతేదీ వరకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాంసం దుకాణాలను మూసివేస్తూ అక్కడి నగర మేయర్ ముఖేష్ సూర్యన్ ఆదేశాలు జారీ చేశారు.





