News

17 కోట్ల మందికి అందనున్న ఆయుష్మాన్ భారత్ సేవలు

467views
  • ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ‌కంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్)కు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినేట్ ఏబీడీఎమ్ స్కీమ్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం వచ్చే ఐదేళ్ళ‌కు 1,600 కోట్లు కేటాయించింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ఏ) అమలు చేస్తుంది. ఈ పథకం కింద పౌరులు ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ)’ ఓపెన్ చేసుకోవచ్చు. హెల్త్‌కు సంబంధించిన రికార్డులను డిజిటల్‌గా నమోదు చేసుకోవచ్చు. ఈ రికార్డులు వైద్య రంగంలో సేవలందించే వారికి ఉపయోగపడతాయి. డిజిటల్ టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు పొందే వీలవుతుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 17 కోట్లకు పైగా అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని కేంద్రం ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి