News

అయ్యో పాపం గోమాతలు. గోవులపై కాంగ్రెస్ స‌ర్కార్ సంచలన నిర్ణయం

730views
మధ్యప్రదేశ్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆవుల సంరక్షణపై రాష్ట్రంలోని లక్ష ఆవుల కోసం వెయ్యి గోశాలలు నిర్మించాలని నిర్ణయించినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రత్యేకాధికారి వెల్లడించారు. నగరాల్లో రోడ్లపై ఆవులు సంచరిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని ఆయ‌న వివరించారు. గోశాలల నిర్మాణం కోసం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించనున్నారు. అయితే ఈ గోశాల‌ల నిర్మాణం నాలుగు నెల‌ల్లో పూర్తి చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎవ‌రైన గోవుల‌ను వ‌ధించిన‌ట్ల‌యితే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది ప్ర‌భుత్వం.
Source : Bharath Today.