News

క్రైస్తవ మహిళపై లైంగిక వేధింపులు!

607views
  • వీహెచ్‌పీ జోక్యంతో మహమ్మద్ షరీఫ్ సిద్ధిక్ అరెస్టు

మంగ‌ళూరు: 27 ఏళ్ల క్రైస్తవ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 49 ఏళ్ల మహ్మద్ షరీఫ్ సిద్ధిక్‌ను మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె వీహెచ్‌పీని ఆశ్రయించింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖలో, బాధితురాలి తల్లి తన సంఘం నాయకులు, పోలీసులు సహాయం చేయడం లేదని రాసింది. వీహెచ్‌పీ జోక్యం తర్వాత, మంగళూరులోని సూరత్‌కల్ పోలీసులు కేసు నమోదు చేసి, సిద్ధిక్‌ను అరెస్టు చేశారు. అనంత‌రం సిద్ధిక్‌ను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

నాలుగేళ్లుగా సిద్ధిక్ తన కుమార్తెను వేధిస్తున్నాడని, బాధితురాలికి మత్తుమందు కూడా ఇస్తున్నాడని బాధితురాలి తల్లి తెలిపారు. మరో ముగ్గురు మహిళలపై కూడా సిద్ధిక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి