News

అదృష్టవంతులు కాబట్టే దొరికిపోయారు.. ఇక్కడ అడుగుపెట్టి ఉంటే లేపేసేవాళ్ళం: యోగి

615views

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రౌడీలకు, గూండాలకు బ్యాడ్ టైమ్ మొదలైంది. యోగి చర్యలకు ఎంతో మంది భయపడి పోయి పోలీసులకు సరెండర్ అయిపోయారు. మమ్మల్ని అరెస్ట్ చేయండి బాబోయ్ అంటూ అడుక్కున్నారు. ఇక తీవ్రవాద చర్యలకు యోగి ఆదిత్యనాథ్ ఏ మాత్రం ఆస్కారం ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద అయితే భద్రత మరింత ఎక్కువ చేశారు.

ప్రస్తుతం ప్రయాగరాజ్ లో కుంభమేళా జరుగుతోంది. లక్షల మంది ప్రజలు ప్రతి రోజూ పుణ్య స్నానాలను ఆచరిస్తూ ఉన్నారు. అయితే కుంభమేళాను టార్గెట్ చేయాలని కొందరు తీవ్రవాదులు ప్రయత్నించారు. మహారాష్ట్రకు చెందిన ATS మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసింది. ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో విధ్వంసం సృష్టించాలన్నది వాళ్ళ ప్లాన్ అని విచారణలో తేలింది. ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తీవ్రవాదులను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా వారు దొరికిపోయి మంచిదైందని.. పొరపాటున కూడా వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో అడుగుపెట్టి ఉండి ఉంటే వాళ్ళను లేపేసేవాళ్లమని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళా కోసం ఎంతో పటిష్టమైన చర్యలు చేపట్టారు.

 

Source : Bharath Today.

https://www.bhaarattoday.com/news/national/story/30430.html