News

కోటి మంది భక్తులకు మేడారం ప్రసాదం

481views
  • ఇంటి వద్దే అందించనున్న తెలంగాణ సర్కార్

భాగ్య‌న‌గ‌రం: మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఈసారి ప్రసాదం, పసుపు, కుంకుమలను పంపిణీ చేయాలనుకుంటున్నట్టు తెలంగాణ సర్కార్ తెలిపింది. అమ్మవార్లకు భక్తులు మొక్కుగా గద్దెలపై సమర్పించే బంగారం(బెల్లం), పసుపు, కుంకుమలను భక్తులు ఇంటికి తీసుకెళ్తారు. 2022 ఫిబ్రవరిలో జరిగే జాతరలో మొక్కులు చెల్లించిన భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేసే ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు.

కోటి మందికి అందేలా బెల్లం, పసుపు, కుంకుమలను ప్రత్యేకంగా ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించడంతో పాటు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి