
531views
-
రష్యాను హెచ్చరించిన అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు పాల్పడితే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. మిత్ర దేశాలతో తాము చాలా సన్నిహితంగా వ్యవహరించడమే కాకుండా సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఆ దేశాలపై దురాక్రమణకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
తమకు దౌత్యంతో పాటు ఎదుర్కొవడం కూడా తెలుసని, గతంలో పుతిన్‌తో బైడెన్ సమావేశమైనప్పుడు ఇరుదేశాధినేతలు బలమైన బంధానికి ప్రాధాన్యత ఇచ్చారని..అలా అని దానిని రష్యా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూస్తారని బ్లింకన్ హెచ్చరించారు.





