
617views
బ్రూనై: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బహిరంగ స్వేచ్ఛ, సమ్మిళిత వృద్ధే భారత్ కర్తవ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బ్రూనైలో నిర్వహించిన 16వ తూర్పు ఆసియా కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వివిధ దేశాలతో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా బహుపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. దేశాల సార్వభౌమాధికారంతో పాటు.. ప్రాదేశిక సమగ్రతను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.





