News

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

617views
  • స్పెషల్‌ ట్రైన్లు పొడిగించిన రైల్వే శాఖ

విజయవాడ: కరోనా వల్ల రైళ్ళ రద్దు, ఆ తర్వాత కొద్దిపాటి రైళ్ళు రాకపోకలు సాగించిన విషయం విదితమే. ప్రస్తుతం రైళ్ళ రాకపోకలు ఊపందుకున్నాయి. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో సౌత్‌ ఇండియన్‌ రైల్వే పలు స్పెషల్‌ ట్రైన్లను పొడిగించింది. ఈ నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. సౌత్‌ ఇండియన్‌ రైల్వే ప్రకటించిన ఈ జాబితాలో డైలీ, వీక్లీ సర్వీసులు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన జాబితాలో పొడగించిన ప్రత్యేక రైల్‌ సర్వీసుల వివరాలివి.

  • హౌరా – హైదరాబాద్‌ల మధ్య ప్రతీరోజూ నడిచే 08645 ట్రైన్‌ సర్వీస్‌ను 28-09-2021 నుంచి 31-12-2021 వరకు పొడగించారు.
  • హైదరాబాద్‌ – హౌరాల మధ్య ప్రతిరోజూ నడిచే 08646 ట్రైన్‌ సర్వీస్‌ను 30-09-2021 నుంచి 02-01-2021 వరకు పొడగించారు.
  • షాలిమార్‌ – సికింద్రాబాద్‌-షాలిమార్‌ (02449/50)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్‌ సర్వీస్‌ను 06-10-2021 నుంచి 31-12-2021 వరకు పొడగించారు.
  • హతియా – యశ్వంత్‌ పూర్‌ – హతియాల మధ్య వారానికి రెండు రోజులు నడిచే ఈ ట్రైన్‌ సర్వీస్‌ (02835/36) ను 28-09-2021 నుంచి 30-12-2021 వరకు పొడిగించారు.
  • హౌరా – మైసూరు – హౌరా (08117/08118)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్‌ సర్వీసులను 01-10-2021 నుంచి 02-01-2021కి పొడగించారు.
  • హౌరా – యశ్వంత్‌పపూర్‌ – హౌరా (02873/74)ల మధ్య ప్రతి రోజూ నడిచే ట్రైన్‌ సర్వీసులను 28-09-2021 నుంచి 02-01-2021కి పొడగించారు.
  • హౌరా – వాస్కొడిగామా – హౌరా (08047/48)ల మధ్య నడిచే స్పెషల్‌ ట్రైన్‌ సర్వీసులను 27-09-2021 నుంచి 02-01-2021కి పొడగించారు.
  • హౌరా – పాండిచ్చరి – హౌరా (02867/68)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్‌ సేవలను 03-10-2021 నుంచి 29-12-2021కి పొడగించారు.
  • హౌరా – ఎర్నాకులమ్‌ -హౌరా (02877/78)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్‌ సేవలను 02-10-2021 నుంచి 27-12-2021కి పొడగించారు.
  • హతియా – బెంగళూరు – హతియా (08637/38)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్‌ సేవలను 02-10-2021 నుంచి 28-12-2021కి పొడగించారు. Source :TV9

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి