News

దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా.. బెంగళూరు ఐఐఎస్సి.. ప్రపంచ ర్యాంకింగ్లో చోటు..

820views

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఏటా ప్రకటించే ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) మరోసారి సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్‌ జాబితాలో 301-350 మధ్య చోటు దక్కించుకోగా, భారతీయ వర్సిటీల్లో తొలి స్థానంలో నిలిచింది. వరుసగా మూడేళ్లుగా ఈ జాబితాలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది.

గురువారం ప్రకటించిన జాబితాలో ఆరు భారతీయ విశ్వవిద్యాలయాలు 600లోపు ప్రపంచ ర్యాంకులు సాధించాయి. వీటిలో ఐఐటీ రాయ్‌పూర్‌, జేఎస్‌ఎస్‌ అకడమిక్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (351-400), ఐఐటీ ఇందోర్‌ (401-500), అలగప్ప, థాపర్‌ విశ్వవిద్యాలయాలు (501-600) మెరుగైన ర్యాంకులు సాధించాయి. మరో 10 విశ్వవిద్యాలయాలు 8001-1000 ర్యాంకుల మధ్య చోటు దక్కించుకోగా వీటిలో బనారస్‌ హిందూ, జేఎన్‌యూ, దిల్లీ టెక్నాలజీ తదితర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ర్యాంకుల్లో ఆక్స్‌ఫర్డ్‌, కాలిఫోర్నియా ఐటీ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి