News

మహా మాజీ హోంమంత్రి దేశ్‌ముఖ్ ‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు –  అరెస్ట్ ఖాయం

530views

హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ‌పై దాఖలైన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ నుండి మధ్యంతర రక్షణ కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో దేశ్‌ ముఖ్ ‌పై జరుగుతున్న విచారణకు సంబంధించి దేశ్ ‌ముఖ్ ‌ను పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేయవచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి.

జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, కృష్ణ మురారి మరియు వి రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం దేశ్‌ముఖ్ ‌కు ఎలాంటి మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపడం లేదని, అతను సిఆర్‌పిసి కింద పరిష్కారాలను పొందవచ్చని తెలిపారు.

తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరుతూ దేశ్ ముఖ్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత వారం, దేశ్ ‌ముఖ్ దాఖలు చేసిన పిటిషన్ ను బొంబాయి హైకోర్టు కొట్టివేసింది.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.