
FILE PHOTO: A view shows houses destroyed following a 7.2 magnitude earthquake in Les Cayes, Haiti August 14, 2021. REUTERS/Ralph Tedy Erol NO RESALES. NO ARCHIVES/File Photo
641views
కరిబియన్ దేశం హైతీని శక్తిమంతమైన భూకంపం వణికించింది. భూకంప తీవ్రతతో చాలా భవనాలు కుప్పకూలడంతో 304 మంది చనిపోయారు. 1800 మందికి పైగా గాయపడ్డారు.దేశంలో చర్చిలు, హోటళ్ల సహా ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి.
”దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది”అని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.భూకంపం వల్ల పెద్దఎత్తున నష్టం జరిగిందని దేశ ప్రధానమంత్రి ప్రకటించారు. నెల పాటు అత్యవసరస్థితి ప్రకటించారు.





