News

జి7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక అతిథిగా భారత్….. పాల్గొననున్న ప్రధాని మోడీ

591views

జి-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వర్చువల్‌గా పాల్గొననున్నారు. శని ఆదివారాల్లో జరిగే సమావేశాలకు హాజరుకానున్నారు. బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, కెనడా సభ్య దేశాలుగా ఉన్న ఈ కూటమి సమావేశాలు శుక్రవారం ఆరంభం కానున్నాయి. ఆతిథ్య బ్రిటన్‌.. ప్రత్యేక ఆహ్వానితులుగా భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణకొరియా, దక్షిణాఫ్రికాలను పిలిచింది. కరోనా పరిస్థితుల దృష్యా ప్రధాని మోడీ.. బ్రిటన్‌ వెళ్లరని గత నెలలోనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.