
567views
కరోనా వైరస్‌పై మరింత సమాచారం కోసం చైనాను బలవంతం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ఈ విషయంలో సభ్యదేశాల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
‘కరోనా మూలాల సమాచారంపై ఎవరినీ ఒత్తిడి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎలాంటి అధికారాలు లేవు. కేవలం అన్ని సభ్యదేశాలు ఈ విషయంలో పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాయని మాత్రం ఆశిస్తున్నాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమాల డైరెక్టర్ మైక్ రేయాన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మానవులకు సోకిందనే వాదనలు ఉన్నాయి. లేదా వుహాన్ ల్యాబ్ నుంచి లీకై ఉండవచ్చనే థియరీలు వెలువడుతున్నాయి. ఇలా భిన్న వాదనలు వస్తోన్న నేపథ్యంలో వైరస్ మూలాలను అర్థం చేసుకోవడానికి మరింత అధ్యయనం అవసరమని మైక్ రేయాన్ ప్రతిపాదించారు.





