News

బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి తరిమి కొట్టాలి : బీహార్ పోలీస్ ఆఫీసర్ అశ్విని కుమార్ హత్య నేపథ్యంలో VHP డిమాండ్.

706views

బీహార్లోని కిషన్ గంజ్ పోలీస్ స్టేషన్ అధికారి అశ్విని కుమార్ హత్యపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. అశ్వనీ కుమార్ క్రూర హత్యకు కారకులైన ముస్లిం దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వి హెచ్ పి డిమాండ్ చేసింది. అక్కడ ఇదే మొదటి సంఘటన కాదని విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు అక్రమ మద్యం తయారీ, అమ్మకం, స్మగ్లింగ్, భద్రతా దళాలు, పోలీసుల పై దాడులకు పాల్పడ్డ సంఘటనలు ఇంతకుముందు కూడా అనేకం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక పోలీసు అధికారుల ఉదాసీనత, రాజకీయ అండదండల కారణంగా ఈ ప్రాంతం నేరస్తుల అడ్డాగా, జిహాదీ ఉగ్రవాదుల కేంద్రంగా, స్లీపర్ సెల్స్ కేంద్రంగా మారిందని, ఈ ప్రాంతం భారతదేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఈ పరిస్థితిని కట్టడి చేయాలని, అక్కడి హంతకులను, నేరస్తులను, నేర చరితులను అరెస్టు చేయాలని ఆయన పేర్కొన్నారు.

ఇది బీహారుకు సరిహద్దు ప్రాంతం కావడంతో బీహార్లో నేరం చేసిన దుండగులు ఈ ప్రాంతానికి వచ్చి హాయిగా ఆశ్రయం పొందుతున్నారని, ఎవరైనా పోలీస్ అధికారులు వారిని వెంటాడుతూ ఈ ప్రాంతానికి వస్తే వారిపై కత్తులు, కటార్లతో వ్యూహాత్మకంగా దాడి చేసి అంతమొందిస్తున్నారని ఆయన తెలిపారు. మృతుడు అశ్వనీ కుమార్ కుటుంబానికి విశ్వ హిందూ పరిషత్ తరపున తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్ లో తిష్ఠ వేసుక్కూర్చున్న బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల ఏరివేతకు ఇదే తగిన సమయమని, దీంతో వారికి మన దేశంలో ఉన్న రాజకీయ అండదండలు కూడా బహిర్గతమవుతాయని శ్రీ మిలింద్ పరాండే పేర్కొన్నారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.