News

ఛత్తీస్ గడ్ : మహిళపై కాంగ్రెస్ నేత దాడి

1.1kviews

త్తీస్ గడ్ ‌లో ఒక కాంగ్రెస్ నాయకుడు బుధవారం ఒక మహిళపై దారుణంగా దాడి చేశాడు. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే….. ఆమె నాలుగేళ్ల కుమారుడు అనుకోకుండా నాయకుడి కారు నంబర్ ప్లేట్‌ను పగలగొట్టడం. రాయ్ పూర్ జిల్లాలో కాంగ్రెస్ కౌన్సిలర్ ‌గా ఉన్న మంగ్రాజ్ సోంకర్ అనే కాంగ్రెస్ నాయకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆ 4 సంవత్సరాల చిన్నారిని కూడా కొట్టారు. సదరు మహిళపై కౌన్సిలర్ దాడికి పాల్పడుతున్న సమయంలో ఆమె భర్తతో సహా చుట్టుప్రక్కల వారు సైతం మౌన ప్రేక్షకులుగా మిగిలిపోవాల్సి వచ్చింది. దాడి వీడియో వైరల్ అయిన తరువాత, పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. 2018 నుండి ఛత్తీస్ గడ్ ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.