News

కేరళ : తన పాకిస్థాన్ భార్య సమాచారాన్ని దాచి నామినేషన్ : LDF అభ్యర్థిపై ఆరోపణలు

1.2kviews

కేరళలోని కొండోట్టి అసెంబ్లీ నియోజకవర్గంలో LDF స్వతంత్ర అభ్యర్థి టి సులైమాన్ హాజీ నామినేషన్ ‌పై కేరళలో పెను వివాదం చెలరేగింది. నామినేషన్ పరిశీలనలో, అతని జీవిత భాగస్వామి వివరాలు అందులో నింపకపోవడంతో అతని నామినేషన్ ను తదుపరి విచారణ కోసం అధికారులు పక్కన పెట్టారు. జీవిత భాగస్వామి యొక్క వివరాలు ఇవ్వవలసిన కాలమ్ లో ‘వర్తించదు’ అని వ్రాసి ఉంది.

ముస్లిం లీగ్ నాయకులు అతని భార్యలలో ఒకరిని పాకిస్థాన్ లోని రావల్పిండికి చెందిన హీరా ముహమ్మద్ సఫ్దార్ గా తెలియజేస్తూ అందుకు తగిన ఆధారాలను అధికారులకు సమర్పించారు.

అంతకుముందు, టి సులైమాన్ హాజీ…. గల్ఫ్ ‌లో పనిచేయాలనుకునే ఎవరికైనా తాను ఉద్యోగం ఇస్తానని కొండోట్టి నియోజకవర్గ ఓటర్లకు హామీ ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.