
496views
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలోని చెరువుకట్ట నరసప్పతాత (లక్ష్మీనరసింహస్వామి) విగ్రహంపై ఉండే శేషపడగలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామానికి 2 కి.మీ.దూరంలో సూగూరు జలాశయం వద్ద ఉన్న ఆలయంలో ప్రతి సోమ, గురువారాలు పూజారి పూజలు చేస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయానికి తాళం వేసి ఉంటుంది. సోమవారం ఉదయం పూజారి నాగరాజు ఆలయానికి వచ్చి చూడగా విగ్రహంపైన ఉండే తొమ్మిది శేషపడగల్లో నాలుగింటి తలలు ముక్కలుగా పడి ఉన్నాయి. ఆయన స్థానికులకు తెలిపి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.





