News

వ్యవసాయ, కార్మిక సంస్కరణలతో రైతులకు, కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు : ప్రధాని మోడీ

The Prime Minister, Shri Narendra Modi addressing at the dedication of three key projects related to the Petroleum sector in Bihar to the nation via video conferencing, in New Delhi on September 13, 2020.
447views

వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి స్పష్టంచేశారు. ముఖ్యంగా, 86శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల, కార్మికుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వాలు, వారి వాగ్దానాలను గాలికి వదిలేశాయని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి రైతులకు, కులీలకు అబద్దాలు చెబుతూనే ఉన్నారని, తాజా సంస్కరణలపై ఇప్పుడు కూడా రైతులను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పంటలకు కనీస మద్దతు ధర పెంచడంలో రికార్డు సృష్టించామని అన్నారు. భాజపా నాయకులతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా, తాజాగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల వల్ల దాదాపు 50కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు సరైన సమయంలో వేతనాలు అందుతాయన్నారు. ఇప్పటివరకు కేవలం 30శాతం మంది కార్మికులు మాత్రమే కనీస వేతనాలు పొందేవారని, ప్రస్తుతం అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయన్నారు. వ్యవసాయంలో ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను, వాటి ప్రయోజనాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలకు ప్రధాని మోడీ సూచించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.