
536views
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బాంద్జూ ప్రాంతంలో మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్ జవాను అమరుడైయ్యారు. ఆర్మీ 55వ రాష్ట్రీయ రైఫిల్స్, 182 బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఒక ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ జవాన్లు కూడా షూటింగ్ ప్రారంభించారని, ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులు, ఒక జవాన్ మృతిచెందారని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. అక్కడ కొన్ని తుపాకులతో పాటు బులెట్లు, మందుగుండు సామాగ్రి దొరికినట్లు ఆయన తెలిపారు.





