
”ఒక (మత) విశ్వాసములో ‘ఆజాన్’ అనేది అంతర్భాగమము కానీ దానిని వినిపించడానికి వాడే పరికరం కాదు.” అంటారు ప్రముఖ రచయిత మరియు గేయ రచయిత అయిన జావేద్ అక్తర్. ఇతరులకు అసౌకర్యం కలిగిస్తుంది కాబట్టి ఇస్లామిక్ ప్రార్ధనకై పిలుపునిస్తూ లౌడ్ స్పీకర్లలో ‘ఆజాన్’ వినిపించడం ఆపేయాలని ఆయన అంటున్నారు.
శనివారం (మే 9 న ) చేసిన ఒక ట్వీట్ లో ఆయన, నిషేధించబడిన ఆచారాన్ని గత యాభై సంవత్సరాలుగా ఎందుకు అనుమతిస్తున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆయన తన ట్వీట్ లో ఏమన్నారంటే…
” 50 సంవత్సరాల క్రితం వరకూ భారత దేశం లో ఆజాన్ ని లౌడ్ స్పీకర్లలో వినిపించడం నిషేధం. తరువాత ఇది అనుమతించబడింది. అనుమతించబడింది కాబట్టి ఇక దానిని ఆపడం అంటూ ఉండదు. ఆజాన్ మంచిదే కానీ దానిని లౌడ్ స్పీకర్లలో వినిపిస్తే అది ఇతరులకు అసౌకర్యం కలిగిస్తుంది. కనీసం ఇప్పుడన్నా వాళ్ళంతట వాళ్ళు ఆ పని (ఆజాన్ ని లౌడ్ స్పీకర్లలో వినిపించడాన్ని మానేయడం) చేస్తారని ఆశిస్తున్నాను”
దేవాలయాల మీద రోజూ లౌడ్ స్పీకర్ల ను ఉపయోగించడం మీద మీ అభిప్రాయం ఏమిటి అని ఒక ట్విటర్ వినియోగదారుడు అడిగినప్పుడు ఆయన రోజూ వాటిని ఉపయోగించడం ఆందోళన కలిగించే అంశం అని అభిప్రాయపడ్డారు.
“అది దేవాలయం కానీయండి, మసీదు కానీయండి, ఏవన్నా పండుగలప్పుడు లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం బాగానే ఉంటుందని. కానీ దేవాలయాలలో అయినా, మసీదులలో అయినా వాటిని ప్రతి రోజూ ఉపయోగించరాదు.
గత వెయ్యి సంవత్సరాలుగా ఆజాన్ ను లౌడ్ స్పీకర్లు ఉపయోగించకుండా ఇస్తున్నారు. ఆజాన్ అనేది విశ్వాసములో ఒక భాగం కానీ, పరికరం (లౌడ్ స్పీకర్) కాదు.” అని ఆయన సమాధానం ఇచ్చారు.
అంతకు ముందు, మార్చ్ లో, కరోనా మహమ్మారి కారణంగా కాబా, మదీనాలను కూడా మూసేశారు కాబట్టి మన దేశంలోని మసీదులన్నీ మూసివేయాలని ఆయన సూచించారు. అలాగే మార్చ్ 24 నుండి ఆరంభమయ్యే పవిత్ర రంజాన్ మాసం లో ఇళ్లల్లోనే ప్రార్ధనలు చేసుకోవాలని ఆయన ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు.
“రంజాన్ మాసం సమీపిస్తోంది. మీరు ప్రార్ధనలు చేయండి, కానీ దాని వలన ఇతరులకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని నేను ముస్లిం సోదరులను అభ్యర్ధిస్తున్నాను. మసీదులలో చేసే ప్రార్థనలను మీరు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. మీ ఇల్లు, ఈ నేలా అన్నీ ఆయన (అల్లా) సృష్టించినవే అని మీరు విశ్వసిస్తున్నారు. అలాంటప్పుడు ప్రార్థనలను ఎక్కడన్నా చేయచ్చు” అని ఆయన సూచించారు.
SOURCE :-PTI
https://m.dailyhunt.in/news/india/english/deccan+herald-epaper-deccan/for+almost+50+years+azaan+on+loudspeaker+was+haraam+then+it+became+halaal+javed+akhtar-newsid-183690430?ss=pd&s=a





