NewsSeva

జయ భారత్ హాస్పిటల్ (సింహ పురి వైద్య సేవా సమితి) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

200views

Dr బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ శిభిరం లో 40 మంది రక్త దాతలు రక్త దానం చేశారు. ఈ సందర్బంగా జయ భారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ మారెళ్ళ గురుప్రసాద్ మాట్లాడుతూ  ప్రస్తుతం కోవిద్-19 లాక్ డౌన్ సమయంలో  బ్లడ్ బ్యాంక్ లలో రక్తనిల్వలు లేక అత్యవసర కేసులకు రక్తం దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో అత్యంత ముఖ్యమని భావించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ శిబిరంలో RSS కార్యకర్తలు మరియు జయ భారత్ హాస్పిటల్  సిబ్బంది పాల్గొని రక్త దానం చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న విపత్కర పరిస్తితులలో RSS కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు .ఈ సమయములో అతి ముఖ్యమైన సేవ రక్త దానమని, కావున రక్త దాతలందురు స్వచ్చందంగా బ్లడ్ బ్యాంక్ కు వచ్చి రక్తదానం చేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఇది అందరూ చేయలేరు కాబట్టి రక్త దాతలు ,స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన ప్రధాన మంత్రి గారు  లాక్ డౌన్ పొడిగించారు కాబట్టి జిల్లాలో ఎక్కడా రక్తం సమస్య లేకుండా చూడాలని ప్రభుత్వ మరియు పోలీస్ అధికారులు రక్త దాతలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డిప్యూటీ మేనేజర్ కృష్ణారెడ్డి RSS నగర సహ  కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు y.సురేష్, రాజేంద్రప్రసాద్, అంకయ్య చౌదరి మరియు హాస్పిటల్ సిబ్బంది, RSS కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.