News

శక్తి ఉపాసనతోనే అంతరంగ సద్గుణాల జాగృతి: మోహన్ జీ భగవత్

23views
పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్‌చాలక్ డా. మోహన్ జీ భగవత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ శక్తి ఉపాసన ప్రాముఖ్యతను వివరించారు. సమస్తం ఆ తల్లి ఆశీస్సులతోనే నడుస్తుందని, శక్తి ఉపాసన ద్వారా సద్గుణాల జాగృతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

శివుని నుండి శక్తిని వేరు చేస్తే కేవలం శవం మాత్రమే మిగులుతుందని, శక్తి ఉంటేనే సమస్తం సాధ్యమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. కీర్తి, శ్రీ, వాక్, శ్రద్ధ, మేధ, ధృతి, క్షమ వంటి సద్గుణాలన్నీ మనిషి అంతరంగంలోనే నిక్షిప్తమై ఉంటాయని, వాటిని జాగృతం చేసి క్రియాశీలకం చేయడమే అసలైన శక్తి ఉపాసన అని ఆయన తెలిపారు.

మన దేశ పునరుజ్జీవన ప్రారంభంలో రామకృష్ణ పరమహంస ఇదే అమ్మను ఉపాసించారని, వారి ఆశీస్సులతో వివేకానందులు ముందుకు సాగి దేశవ్యాప్తంగా ప్రభావం చూపారని డా. మోహన్ భగవత్ గుర్తుచేశారు. అమ్మ స్వయంగా ‘అహం రాష్ట్రీయ సంగమనీ వసూనామ్’ అని చెప్పినట్లుగా, దేశ శక్తి కూడా అదేనని, ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఉపాసన చేస్తూ భౌతిక సుఖ-సంపదలతో పాటు అంతరంగిక సద్గుణాలను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.