News

ప్రమాదకర పరిస్థితులలో చర్చిలో ప్రార్ధనలా?

1.1kviews

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశమంతటా లాక్ డౌన్ అమలులో ఉన్నా, రోజూ వందల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నా కొంతమందికి మాత్రం బుద్ధి రావటం లేదు.

ఒకవైపు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన మార్కత్ జమాతే ప్రార్థనలలో పాల్గొన్న అనేకులు కరోనా బారిన పడి దేశం మొత్తం ఆందోళన చెందుతూ ఉంటే మన రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో రాయవరంలోని ఒక చర్చిలో ఈరోజు వేకువన ఉపవాస ప్రార్థనల పేరుతో సుమారు 150 మంది గుమికూడి ప్రార్థనలు నిర్వహించారన్న వార్త నేడు రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది.

తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని ఒక చర్చిలో ఈరోజు వేకువన మూడు గంటల నుంచి ఉపవాస ప్రార్థనలు మొదలయ్యాయి. ఈ ప్రార్థనలలో సుమారు 150 మంది పాల్గొన్నట్లుగా సమాచారం. ఈ ప్రార్థనలలో పాల్గొన్నవారు కనీసం మాస్కులు కూడా ధరించకపోవడం విశేషం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు, వైద్యశాఖ అధికారులకు సమాచారం అందించటంతో లాకవుట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రార్ధనలు నిర్వహించిన సదరు పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రార్థనలలో పాల్గొన్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.