News

దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు

3views

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని పలు ఆలయాలకు చెందిన భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్టు దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ వెల్లడించారు.విజయవాడ దుర్గగుడికి చెందిన ఆర్.ఎస్. నం.112లోని 11.54 ఎకరాల భూమికి సంబంధించి న్యాయ సలహా అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టాభిరామస్వామి ఆలయానికి చెందిన ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని ఆర్.ఎస్.నం.528/3లోని 1.96 ఎకరాల భూమి దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్లో నమోదు చేసి ఉందన్నారు. ఈ భూమిని నిషే ధిత ఆస్తుల జాబితాలోనూ చేర్చామని.. చట్టప్రకారం చర్యలు చేపడతామ న్నారు. కుమారసిద్ధయ్య మఠానికి సంబంధించిన 14.91 ఎకరాల భూమి వెబ్ ల్యాండ్ లో లేదని, దీనిపై రెవెన్యూ అధికారులను సంప్రదిస్తామన్నారు. విజయ వాడ అన్నదాన సమాజం, దాసాంజనేయ స్వామి ఆస్తుల పరిరక్షణకు అన్ని చర్యలూ చేపడతామన్నారు. గూడవల్లిలోని కోదండ రామాలయానికి చెందిన 2.69 ఎకరాలు బుడమేరు కాలువ విస్తరణ కోసం వినియోగించినప్పటికీ.. భూసేకరణ అవార్డులో చేర్చకపోవడంతో పరిహారం రాలేదన్నారు. ప్రస్తుతం రూ.7.80 కోట్ల పరిహారం మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు.