ArticlesNews

హల్దీఘాటి యుద్ధ విజయ వైభవం 3 వ భాగం

4views

హల్దీఘాటి యుద్ధ విజయ వైభవం 1 వ భాగం

5-6 కోసుల దూరం పారిపోయిన మొగల్ సేనలు

అక్బర్ ఆస్థాన రచయిత అబుల్ ఫజల్ అల్లామి తన అయిన్ `ఎ` అక్బరీలో “మొదటి దాడిలోనే పారిపోవడం ప్రారంభించిన మా సైనికులు, నదిని  దాటి 5`6 కోసుల వరకూ పారిపోయారు. ఇంతటి విధ్వంసకర సమయంలో మిహతర్ ఖాన్ తన సహాయక సేనతో పాటుగా చందావల్ నుంచి బయలుదేరి వచ్చాడు. అతడు డప్పు వాయించి, బిగ్గరగా అరుస్తూ పారిపోతున్న సేనలను ఒకచోట చేరమని చెప్పాడు. అతడి చేసిన ఈ పని సేనల మనస్సుల్లో ఆశ పుట్టించి, వారు పారిపోకుండా చేసింది.” మిహతర్ ఖాన్ బిగ్గరగా అరచి ఏమ న్నాడు అనే విషయం గురించి బదయÖనీ ఏమీ రాయలేదు కానీ అబుల్ ఫజల్ తన అక్బర్‌నామాలో (ఇంగ్లీషు అనువాదం, జి. 3, పేజీ 246)ఏం రాశాడంటే, సాధారణంగా చూసేవారికి, రాణా విజయం ఖాయమైపోయినట్లుగా కనిపించింది. పైన వర్ణనలో రాణా ప్రతాప్ విజయం గురించి ఫజల్ స్పష్టంగా రాశాడు.

“మహారాణా ప్రతాప్ సేనల ముందు వరుసలో ఉండే గ్వాలియర్‌కు చెందిన రాజా మాన్ మనుమడు రామ్‌షా, వర్ణించడానికి అలివి కానంత వీరత్వాన్ని ప్రదర్శించాడు. కానీ, సైన్యం ముందు వరుసలో దక్షిణం వైపు ఉన్న  మాన్‌సింగ్‌కు చెందిన సేనలోని రాజ్‌పుత్రులు పారిపోయారు. దీనితో ఆసఫ్ ఖాన్ కూడా పారిపోవడమే కాకుండా కుడివైపు ఉన్న సయ్యదుల ఆశ్రయం పొందాడు ” అని అబుల్ ఫజల్ రాశారు.

ఏనుగుల యుద్ధం

ఇరుపక్షాలకూ చెందిన ఏనుగులు తమ తమ సైన్యం నుంచి బయటకు వచ్చి పోరాటం ప్రారంభిం చాయి. మాన్‌సింగ్ వెనుక ఏనుగుపై ఉన్న ఏనుగుల సంరక్షకుడు హుస్సేన్ ఖాన్, ఈ ఏనుగుల యుద్ధంలో పాలుపంచుకున్నాడు.  అక్బర్ ఏనుగుల మందలో ప్రత్యేకమైన ఏనుగు, మహారాణాకు చెందిన ‘రామ ప్రసాద’ అనే ఏనుగుతో గట్టి పోరాటం చేసింది. అది పరాజయం పాలు అయినప్పుడు మొగల్ సైనికుడు కమల్‌ఖాన్ ఆ ఏనుగును ఎదుర్కొన్నాడు. రాజ ఏనుగు గాయాలపాలైంది. రామప్రసాద్ ఏనుగు అనేకమంది మొగల్ సైనికులను చంపిపడేసింది. అప్పుడు, ‘రామప్రసాద’ను ఎదుర్కొని, పోరాడేం దుకు, మొగలు సైనికులు తమ గజరాజును ముందుకు తీసుకువచ్చారు. కానీ గజరాజు కూడా రామప్రసాద్‌తో పోటీపడలేక పోయింది. అప్పుడు రామ్ ప్రసాద్‌ను ఎదుర్కొనేందుకు మొగల్ మావటివాడు పంజూరామ్ మదావత్‌ను ఏనుగుతో తీసుకొని వచ్చారు. రెండు ఏనుగుల మధ్య భీషణ యుద్ధం జరిగింది. రామప్రసాద్ ఏనుగు కూడా వెనుకంజ వేయడం ప్రారంభించింది కానీ యుద్ధంలో శత్రువుల దంతాలను విరగొట్టే రామప్రసాద్ ఏనుగుకు చెందిన మావటివవాడు గాయపడడంతో పరిస్థితి పూర్తిగా తిరగబడింది. పరిస్థితిని గమనించిన రాచ ఏనుగుల నిర్వాహకుడు హుస్సేన్ ఖాన్, రామప్రసాద్ మావటివాడు మరణించగానే ఆ స్థానాన్ని తాను ఆక్రమించి, ఏనుగును తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బదాయునీ కొందరు సైనికులతో కలిసి రామప్రసాద్ ఏనుగును తీసుకుని అజ్మీర్ వైపు ప్రయాణమయ్యారు. ‘మొగల్ సైనికులు రామప్రసాద్‌ను తీసుకుని అజ్మీర్ వైపు ప్రయాణిస్తుండగా, మేవాడ్ నివాసులు దానిపై మట్టి విసిరి దానిని అవమానించడం ప్రారంభించారు’ అని ‘ముస్తాఖాబ్ఉ-త్త-వారీఖ’లో రాశారు.

బహలోల్ ఖాన్‌ను చంపడం

అదే సమయంలో మాన్‌సింగ్ సేనలకు ముందు వరుసకు నేతృత్వం వహించే వాడు, అతని తురుఫు ముక్క.. ఉజ్బెక్ బహలోల్ ఖాన్, మాధవ్‌సింగ్ కచ్ఛావాతో పాటు ఉన్నాడు. అతడు మానసింగ్ రక్షణ కోసం ముందుకు కదిలి,  రాణాప్రతాప్ సమీపానికి వచ్చాడు. మహారాణా తన కత్తితో అతడి తలపై భీషణంగా దెబ్బకొట్టాడు. ఈ దెబ్బకు బహలోల్ ఖాన్ రక్షణ కవచం, గుర్రంతో సహా రెండు ముక్క లయ్యాడు. అక్బర్ సేనల్లో అత్యంత శక్తిశాలి అయిన ఉజ్బెక్ సైనికుడు బహలోల్ ఖాన్.

మొగల్ సేనా నాయకుడు మాన్‌సింగ్‌పై ప్రతాప్ దాడి

బహలోల్ ఖాన్‌ను వధించి, చేతక్‌పై సవారీ చేస్తున్న మహారాణా ప్రతాప్ యుద్ధంలో సేనలను వేగంగా సంహరిస్తూ, మాన్‌సింగ్ వైపు కదిలాడు. ఈ మధ్యలోనే దోడియా భీమ్‌సింగ్ తన బల్లెం తీసుకుని మాన్‌సింగ్ ఏనుగువైపు  దూకి, గుర్రంపై నుంచి బల్లెంతో మాన్‌సింగ్‌ను తీవ్రంగా గాయపరుస్తూ, ‘నిన్ను నువ్వు కాపాడుకో మాన్‌సింగ్, దోడియా భీమ్‌ను వచ్చాను’ అన్నాడు. ఈ యుద్ధంలో మానసింగ్ ఏనుగు అంబారీలో కూర్చుని వచ్చాడు. అతడు కింద వంగి దోడియా  భీమ్‌సింగ్ బల్లెపు దాడినుంచి తనను తాను కాపాడుకున్నాడు. భీమ్‌సింగ్ గుర్రం నుంచి కిందపడటంతో మొగల్ సైనికులు చుట్టుముట్టినా ప్రబలమైన పరాక్రమాన్ని చూపి వీరగతిని పొందాడు. మహారాణా ప్రతాప్ గుర్రమైన చేతక్ తన రెండు కాళ్లను మానసింగ్ ఏనుగు కుంభస్థలంపై ఉంచి, మాన్‌సింగ్‌పై తన యజమాని దాడి చేసే సౌకర్యాన్ని కల్పించింది. మహారాణా ప్రతాప్ గర్జిస్తూ,  నీకెంత సాధ్యమైతే అంత సాహసాన్ని ప్రదర్శించు, ప్రతాప్‌సింగ్ వచ్చాడు అన్నాడు. ఆ మాట అన్న తర్వాత మహారాణా ప్రతాపుడు మాన్‌సింగ్‌పై బల్లెంతో దాడి చేశాడు. కానీ ఆ దాడి నుంచి తనను తాను కాపాడు కునేందుకు మాన్‌సింగ్ తన అంబారీలో వంగి కూచున్నాడు. దీనితో మహారాణా బల్లెం అంబారీకి తగిలి, మాన్‌సింగ్ బతికిపోయాడు. దీనితో గాయపడి, భీతిల్లిన మావటివాడు ఏనుగును వెనక్కి తిప్పి యుద్ధక్షేత్రం నుంచి మాన్‌సింగ్‌ను బయటకు తీసుకువచ్చాడు. దీని తర్వాత, మాన్‌సింగ్ తన సేనలను కలవడానికి సాయంత్రం మోలేలా చేరుకున్నాడు. కానీ అక్కడ ఎవరూ కలవలేదు. ఆ మరురోజు సాయంత్రం గుగేందూలోనే అతడు సేనలను కలుసుకోగలిగాడు. మాన్‌సింగ్ మరణించా డని భావించిన రాణా ప్రతాప్ తన గుర్రాన్ని అక్కడ నుంచి వెనక్కి తిప్పాడు. ఈ యుద్ధంలో జయమల్ మోడతియా కుమారుడు రామదాస్, గ్వాలియర్ మహారాజు రామ్‌షా తమ పుత్రులు శాలివాహనుడు, ఇతర కుమారులతో కలిసి ధైర్యంగా పోరాడి తమ సేవలను అందించారు. మాధవ్ సింగ్ కచ్ఛావాతో పోరాటం చేస్తుండగా మహారాణాపై బాణాల వర్షం కురిసింది.  సయ్యద్‌లతో పోరాడుతున్న  హకీం ఖాన్ సూర్‌జీ పరుగున వచ్చి మహారాణాను కలిశాడు. ఈ రకంగా, మహారాణా సైన్యంలోని రెండు విభాగాలు కలిసిపోయాయి. యుద్ధం కూడా ముగింపుకు రావడం ప్రారంభమైంది. దీనితో మొగల్ సేనలలోని రాజపుత్రులు చెల్లాచెదురయ్యి, వెనక్కి తగ్గడం ప్రారంభించారు. అంతేకాదు, సుమారు అర కోసు వెనక్కి వెళ్ల, బనాస్ దక్షిణ కొనకు చేరుకున్నారు. అలా వెనక్కి తగ్గుతున్న మొగల్ సేనల కారణంగా మేవాడ్ యోధులలో ఉత్సాహం తగ్గడం లేదు.

యుద్ధ మైదానం నుంచి మహారాణా ప్రతాప్‌ను తప్పించడం

ఆ సమయానికి మహారాణా ప్రతాప్‌కు గాయాలు అయ్యాయి. అలాంటి స్థితిలో మాన్‌సింగ్ (ఝాలా బీదా) అంతకుముందే పన్నిన వ్యూహం ప్రకారం మహారాణాప్రతాప్ మొగలులతో భవిష్యత్ యుద్ధ పోరాటాలను కొనసాగించ డానికి యుద్ధ ప్రాంతం నుండి తరలించాలని కోరాడు. చేతక్ పగ్గాలు పట్టుకొని, దాని ముఖం పక్కకు తిప్పమని హకీమ్ ఖాన్ సూర్‌ను ఝాలా బీదా చెప్పాడు.  అతడితో పాటు భామా షా, తారాచంద్‌తో మీరు మీ సైనిక దళాలతో మహారాణా ప్రతాప్‌కు వెనుక నుంచి రక్షణ కల్పిస్తూ, అతడిని యుద్ధక్షేత్రం నుంచి బయటకు తీసుకువెళ్లండి అన్నాడు. దీనికి ముందు, ఈ అవకాశం చూసి, మొగల్ సైన్యం దృష్టిని సులభంగా మళ్లించేందుకు ప్రతాప్ ఛత్రాన్ని, మేవాడ్ ఇతర రాజ చిహ్నాలను ఝాలా బీదా స్వీకరించాడు. మహారాణా ప్రతాప్‌ను భామాషా, తారాచంద్ కావడియా ద్వారా, అతడి సైనిక విభాగం సహయోగంతో సురక్షితంగా యుద్ధ క్షేత్రం నుంచి బయటకు తీసుకువచ్చారు.  ‘ముంతఖాబ్`ఉత్`తవారీఖ’లో అబ్దుల్ ఖాదిర్ బదాయÖనీ ఈ ఘాటాన్ని వర్ణిస్తాడు.