News

ఢిల్లీ యూనివర్సిటీలో మత మార్పిడి తంతు

33views

న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వ విద్యాలయంలో అక్రమ మత మార్పిళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్నేహం, విద్య, ఆర్థిక సాయం, భోజనం, సినిమాలు వంటి వాటిని ఉపయోగించి, కొన్ని బృందాలు అక్రమ మత మార్పిళ్లను భారీ మొత్తంలో చేస్తున్నాయని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

దీనికి సంబంధించిన ఓ విద్యార్థి ఓ జాతీయ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోనే ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. యూనివర్సిటీలో అక్రమ మత మార్పిళ్ల అంశం మొదట అనధికారిక సంభాషణలతో మొదలవుతుందని, మెళ్లి మెల్లిగా వ్యక్తిగత విషయాలు, విద్యాపరమైన, ఆర్థికపరమైన విషయాలు మాట్లాడుతూ.. ముగ్గులోకి దించుతారని తెలిపాడు. దీంతో ఆదివారం ప్రార్థనలకు ఆహ్వానిస్తారని అక్కడే క్రమంగా క్రైస్తవ బోధనలు, ప్రార్థన కార్యక్రమాలను పరిచయం చేస్తారన్నారు.

అయితే.. మత మార్పిడి అనే అంశం నేరుగా తెరపైకి రాదని, మెళ్లి మెళ్లిగా ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. మొదట విద్యార్థులతో స్నేహం ఏర్పరచుకుని, వారి వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆయన పేర్కొన్నారు.ఆర్ట్స్ ఫ్యాకల్టీ పరిసరాల్లోనూ, విశ్వవిద్యాలయంలోని ఇతర ప్రాంతాల్లోనూ విద్యార్థులను కొందరు వ్యక్తులు సంప్రదిస్తుంటారని, విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటూ, సాయం అందిస్తూ.. క్రైస్తవంలోకి మారమని చెబుతుంటారని ఆ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఒకసారి సంబంధం ఏర్పడిన తర్వాత, విద్యార్థులను ఆదివారాలు మరియు సెలవు దినాల్లో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానిస్తారని ఆయన ఆరోపించారు. దీని తర్వాతే క్రైస్తవ ప్రార్థనలకు వెళ్లడం, అటు వైపు ఆకర్షితులు కావడం జరుగుతోందని, ఇది నిత్యం జరిగే ప్రక్రియ అని వెల్లడించాడు.

ఈ విద్యార్థి చెబుతున్న దాని ప్రకారం.. వెంటనే మతం మారమని అడగరని, ఒకవేళ ఒత్తిడి వస్తే, అది విద్యార్థులు పదేపదే సమావేశాలకు హాజరై, ఆ బృందంతో పరిచయం ఏర్పడిన తర్వాతే మొదలవుతుందని అతను ఆరోపించాడు.విద్యార్థులకు క్రమంగా క్రైస్తవ విశ్వాసాలను పరిచయం చేసి, ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించేలా ప్రోత్సహిస్తారని అతను పేర్కొన్నాడు. మత మార్పిడిని ప్రోత్సహించే వ్యక్తులు కొన్నిసార్లు క్రైస్తవ మతాన్ని ఇతర మతాల కంటే శ్రేష్ఠమైనదిగా చిత్రీకరిస్తారని, మరియు ఆ మతాన్ని స్వీకరించడం వ్యక్తిగత కష్టాలను పరిష్కరించుకోవడానికి సహాయపడుతుందని సూచిస్తారని కూడా ఆ విద్యార్థి ఆరోపించాడు.

అయితే.. మతం మారడానికి నిరాకరించే విద్యార్థులు టార్గెట్ అవుతారని, వారికి శిక్షలు కూడా పడతాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మతం మారిన విద్యార్థులు కొన్నిసార్లు వ్యక్తిగత సమస్యలను మత విశ్వాసాలతో ముడిపెట్టి తమ స్నేహితులను లేదా పరిచయస్తులను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తారన్నారు.

మరో వైపు ఈ సమావేశాలకు విదేశీయులు కూడా హాజరవుతుంటారని, అయితే.. ఏ కార్యక్రమాలకు విదేశీయులు రావాలి? ఏ కార్యక్రమాని మన దేశం వారు రావాలి అన్నది కూడా నిర్దిష్ట ప్రణాళికతోనే నడుస్తుందన్నాడు. అతను కొరియన్ మరియు అమెరికన్ క్రైస్తవ బృందాలను ఉదాహరణలుగా పేర్కొంటూ, ఆ బృందాలకు సంబంధించిన సమావేశాలలో విద్యార్థులు విదేశీయులను కలుసుకోవచ్చని చెప్పాడు. అయితే.. ఇవన్నీ కూడా ఇంకా ధ్రువీకరించాల్సిన అవసరం మాత్రం వుంది.