News

పవన్ కళ్యాణ్ దాతృత్వం

680views

కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీగా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.