NewsSeva

ఆపత్కాలంలో ఆర్.ఎస్.ఎస్ సేవలు

309views

విష వైరస్ లు  ప్రభవిల్లుతున్న తరుణంలో “పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం తోపాటు వ్యక్తిగత పరిశుభ్రత అవసరం. అది మిమ్ముల్ని వైరస్ ల నుంచి దూరంగా ఉంచుతుంది. అంటే తరుచుగా చేతుల్ని శుభ్రం గా కడుక్కోవడం మర్చిపోకండి ,ఇతర వ్యక్తులతో దగ్గరగా మాట్లాడే ప్రయత్నం చేయకండి.” అని తూర్పు గోదావరి జిల్లా ఐ. పోలవరం మండల సేవాభారతి కన్వీనర్ రెల్లు గంగాధరం పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా ఆర్ . ఎస్ . ఎస్ . ప్రచార ప్రముఖ్ సలాది శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జి. వేమవరం లో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మరియు  గ్రామమంతా బ్లీచింగ్ మరియు మురికి గుంటల్లోనూ, డ్రైనేజి లోను క్రిమి సంహారక రసాయనాలు స్ప్రే చెయ్యించడం జరిగింది.

అలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఆర్ . ఎస్ . ఎస్ . స్వయం సేవకులుముమ్మిడివరం నియోజక వర్గంలో వివిధ గ్రామాలలో ఇద్దరిద్దరు పర్యటిస్తూ  పరిస్థితి కుదుటపడే వరకూ సమూహాలుగా గుమికూడరాదని, అత్యవసరమైతే తప్ప బయటకు తిరగకూడదని, విదేశాలనుంచి వచ్చి క్వారంటైన్  లో ఉన్నవారు 14 రోజులు బయటకు రాకూడదని ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి ఇటువంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే తెలియజేయాలని అందరూ గృహ నిర్బంధం లోనే ఉండాలని సూచించారు . ముమ్మిడివరం ఖండ లో గత మూడు రోజులుగా గా జరుగుతోంది. కరపత్రాలు తో అవగాహన, జనతా కరుఫ్యూ, పోలీసులు సహకారం తో ముమ్మిడివరం లో చర్చి లను మూయించడం , PHC ఉన్న స్థలాల వద్ద, మురికి కాలువలలో, డ్రైనేజీలలో బ్లీచింగ్, క్రిమిసంహారక రసాయనాలు స్ప్రే  చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో ముమ్మిడివరం ఖండ బౌదిక్ ప్రముఖ్ బి. లక్ష్మీనారాయణ , కొప్పరావోరి రాంబాబు, చెక్కా సూరిబాబు, మద్దింశెట్టి దొరబాబు, నల్లా ఆంజనేయులు, సీమకుర్తి ప్రసాద్, మద్దింశెట్టి  రాజబాబు, రెల్లు సాయికుమార్, పేరాబత్తుల రామకృష్ణ , బొంతు కనకారావు తదితరులు పాల్గొన్నారు .

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.