News

అయోధ్య శ్రీరామజన్మభూమి ట్రస్ట్ ప్రకటన..

30views

అయోధ్య శ్రీరామజన్మభూమి ట్రస్ట్ ప్రకటన…

అయోధ్యా శ్రీరామజన్మభూమి ఆందోళనలో అగ్రభాగాన నిలిచి 40 సంవత్సరాలకు పైగా పోరాటానికి నేతృత్వం వహించిన మాన్యుల పేర్లపై దుష్ప్రచారం జరగడం, అయోధ్య శ్రీరామజన్మభూమి పోరాటానికి మసిపూసే ప్రయత్నం జరగడం సహించలేకపోతున్నాము.

– శతాబ్దాల పోరాటంలో పాల్గొన్న వాళ్లు ధనం సంపాదించాలని పాల్గొనలేదు…, తమ సొంత ప్రచారానికి, రాజకీయపరమైన అధికారంలో రావడానికి, అక్రమార్జనకు తెగబడిన వాళ్లు కాదు.

– డబ్బు కాదు కదా ప్రాణాలకు కూడా విలువనివ్వకుండా, స్వాభిమానం కోసమే బ్రతుకుతున్నామని, మందిర నిర్మాణం జరిగే వరకు తలపాగా పెట్టేది లేదు, చెప్పులు తొడిగేది లేదంటూ 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వాళ్లు,

– తరతరాలుగా అనేక మఠాలకు చెందిన పీఠాలకు చెందిన సాధువులు సత్పురుషులు మందిర నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహానుభావులున్నారు,

– తరతరాలుగా ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో కుటుంబాలకు కుటుంబాలే పాల్గొని తమ చెమటను రక్తాన్ని ధనాన్ని సర్వసంపదలను ఒడ్డిన వాళ్ళున్నారు.

– మనకు తెలుసు విశ్వహిందూ పరిషత్ 1980 దశాబ్దం నుండి ప్రత్యక్ష పోరాటంలో నేతృత్వం వహిస్తూ లక్షలాదిమంది కార్యకర్తలను ప్రోత్సహిస్తూ జరిపిన కరసేవలో పాల్గొన్న కారసేవకుల ‘నిష్కామకర్మ’ మనందరికీ తెలిసిందే.

– వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వాళ్లు కొందరైతే, రక్త తర్పణాలు చేసి ప్రాణాలను అర్పించిన త్యాగమయుల చరిత్రలెన్నో….

– గంగా నది ఒడ్డున కూర్చొని ఉమ్మివేసిన వాడి వలన గంగానది పవిత్రత తగ్గిపోదు.. అలాగే ఆలయ నిర్మాణం కోసం చేసిన వీరందరి త్యాగాలను మరిచిపోయి కొంతమంది మోసకారులు ధనం కోసం కక్కుర్తి పడే చెడ్డవాళ్ల చర్యలను చూసి అయోధ్య శ్రీరామజన్మభూమి మందిరం పవిత్రత గాని, శ్రీ రామచంద్రుని ఆదర్శాన్ని కానీ హిందూ సమాజం ఎప్పుడూ మర్చిపోదు.

– ఆలయ ధనం అక్రమార్కుల చేతిలోకి పోతున్నదన్న మాట వినగానే మొదటగా ఫిర్యాదు చేసింది, సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయవలసిందిగా కోరింది కేవలం “శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్”.. ఇందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం త్వరితగతిన స్పందించి ఉన్నత అధికారులతో ఏర్పాటు చేసిన బృందం దర్యాప్తు ప్రారంభించింది, ఎవరి దగ్గరనైనా ఏమాత్రం ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులకు అప్పగించాలని కోరడం జరిగింది..,
\
కొద్ది రోజులలో నిందితుల పైనా తప్పు చేసిన వారి వివరాలపై స్పష్టత వస్తుంది. అంతవరకు సంస్థలను గానీ వ్యక్తులను అపఖ్యాతి పాలు చేయడం కోసం ఇష్టం వచ్చినట్లు పుకార్లను వ్యాపింప చేయడానికి అనుమతించం. ఇలా ఎవరైనా తప్పుగా ఆరోపణలు చేసిన వాళ్లు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

(గమనిక: ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరి, నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామాలు చేసిన మొట్టమొదటి సన్నివేశమని గమనించాలి.)