News

హిందూ యువకులపై దాడి.. “ మా మాటే చెల్లుతుంది” అంటూ ముస్లింల బెదిరింపులు

38views

##

దాపోలి: రత్నగిరి జిల్లా దాపోలిలోని ముస్లింల ఆధిపత్యం ఉన్న చేపల మార్కెట్ ప్రాంతంలో పార్కింగ్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ముగ్గురు హిందూ యువకులపై 5 నుంచి 6 మంది ముస్లిం యువకుల బృందం ప్రాణాంతక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. “ఈ ప్రాంతంలో మా మాటే చెల్లుతుంది.. ఇక్కడ మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ రారు” అంటూ బెదిరింపులకు దిగిన నిందితులు, బాధితుల కారుపై భారీ రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు.

ఈ ఘటన మే 15న మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు అఫ్రిది జోగిల్కర్, అజహర్ జోగిల్కర్, అల్తాఫ్ అలావుద్దీన్ ఆలం సహా పలువురిపై కేసు నమోదు చేసి, ప్రధాన నిందితులను అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, తంగర్ గ్రామానికి చెందిన దీపక్ దత్తారామ్ షెడ్గే ప్రస్తుతం విరార్‌లో నివసిస్తున్నారు. ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్వగ్రామానికి వచ్చిన ఆయన, తన బంధువులు ప్రవీణ్ ప్రతాప్ జెడే, స్వప్నిల్ మారుతి షెడ్గేతో కలిసి మార్కెట్‌కు వెళ్లారు.

కెలాస్కర్ నాకా ప్రాంతంలోని ‘కామ్‌గార్ గల్లి’ వద్ద ఒక టెంపో వాహనం తప్పుదోవలో నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాన్ని సరిగా పార్క్ చేయాలని దీపక్ షెడ్గే కోరగా, అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది.

కొద్దిసేపటి తరువాత మసాలి బజార్ రోడ్డులోని ‘సామంత్ బిల్డింగ్’ సమీపంలో కారును నిలిపి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, మోటార్‌సైకిళ్లపై వచ్చిన యువకుల బృందం వారిని చుట్టుముట్టింది. బాధితుల కారుపై రాళ్లు విసిరి, కిటికీలు ధ్వంసం చేసి తీవ్ర నష్టం కలిగించారు.

అనంతరం అఫ్రిది అహ్మద్ జోగిల్కర్, అజహర్ జోగిల్కర్, అల్తాఫ్ ఆలం కలిసి దీపక్ షెడ్గేను కారులోంచి బయటకు లాగి దారుణంగా కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో గాజు సీసాతో తలపై దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు 12 కుట్లు వేయాల్సి వచ్చినట్లు సమాచారం. “చంపేస్తాం” అంటూ బెదిరింపులు కూడా చేసినట్లు బాధితులు తెలిపారు.

ఈ ఘటనపై దాపోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.