NewsProgrammsSeva

సేవా భారతి సేవలు అపూర్వం – గుంటూరు బాలమేళాలో కొనియాడిన వక్తలు

578views

సేవా భారతి ద్వారా బాపట్లలో నిర్వహింప బడుతున్న అభ్యాసికల సమ్మేళనం “బాలమేళ” కోనా కళాక్షేత్రం బాపట్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ రఘుపతి గారు ఉపసభాపతి ముఖ్య అతిధిగా  విచ్చేశారు. శ్రీ కోన రఘుపతి గారు మాట్లాడుతూ బాపట్ల నగరంలో మరియు చుట్టుపక్కల గ్రామాలలో సేవాభారతి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. రాబోయే రోజులలో కోనా చారిటబుల్ ట్రస్ట్, సేవా భారతి తో కలిసి పనిచేసేటట్లు యోజన చేస్తాము అన్నారు.  ట్రై సైకిల్ ను ఉచితంగా ఇచ్చే విషయంలో మరియు ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు పరిచే విధంగా  సేవాభారతి తో కలిసి పని చేస్తాము అని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శ్రీ రామచంద్ర మిషన్ కు చెందిన శ్రీ మానం మల్లేశ్వరి గారు విచ్చేశారు. వారు మాట్లాడుతూ శారీరక మానసిక సంతులనం కొరకు యోగ చిన్నప్పటినుండి అభ్యాసం చేయాలి అని తెలియచేశారు. మరొక విశిష్ట అతిధి  శ్రీమతి తులసి కుమారి గారు మాట్లాడుతూ విద్య ద్వారా వినయం  కలుగుతుంది, వినయం ద్వారా క్రమశిక్షణ అబ్బుతుంది అన్నారు. సభాధ్యక్షులు డాక్టర్ దీవి  హరి ప్రసాద్ గారు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని పలు సేవా కార్యక్రమాలను వివరించారు. శ్రీ ఆర్ లక్ష్మీపతి సేవా భారతి చేస్తున్న సేవలను కొనియాడారు. సేవాభారతి రాష్ట్ర సంఘటన కార్యదర్శి కాకాని పృథ్వీరాజు గారు భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ సేవాభారతి ద్వారా నిర్వహించబడుతున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు. సేవా భారతి ద్వారా శోషణ ముక్త , సమరసతా యుక్త సమాజం ఏర్పటు చేయటమే లక్ష్యం అని తెలియజేశారు .

తదుపరి ముఖ్య వక్త శ్రీ మల్లికార్జున రావు మాట్లాడుతూ చదువు, సంస్కారం జంటకవులు అని చెబుతూ ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశపుడు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ చెప్పిన పద్యాన్ని చదివి వివరించారు చదివించిరి  నను గురువులు అని చెప్తూ వ్యసనాలకు లోనైనటువంటి కుటుంబాలలో చిన్నారులు పాడిన పాటలు శ్లోకాలు మార్పు తీసుకు వస్తున్నది వారిని వ్యసనాల నుండి దూరం చేస్తున్నది  అని తెలియజేశారు. మరి ఒక ఉదాహరణ చెబుతూ మీరు పెద్ద అయితే ఏమవుతారు అని అడిగిన ప్రశ్నకు ఓక బాలుడు  సెల్ ఫోన్ అవుతాను అన్నారట. ప్రేమకు నోచుకోని పిల్లలు సమాజంలో తల్లిదండ్రులే పిల్లల్ని పట్టించుకోని పరిస్థితి ఉంది. జీవన విలువలు కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయటమే సేవాభారతి నిర్వహించే అబ్యాసిక  ముఖ్యోద్దేశ్యము అని వివరించారు.

తదుపరి అశ్వని సంచార  వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాసులు గారికి శ్రీ కోనా రఘుపతి గారు  సన్మానం చేశారు. అలాగే ఉత్తమ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న  శ్రీమతి శేషారత్నం గారికి సన్మానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను   ఆకట్టుకున్నవి . 85 సంవత్సరాల వయసులో శివ అనే వ్యక్తి ప్రాచీన యుద్ధ కళలను ప్రదర్శించారు. శ్రీ యనుముల పిచ్చిరెడ్డి కార్యక్రమాలను నిర్వహించారు. జాగు శ్రీనివాస్, శేషారావు,రాజేంద్ర ప్రసాద్, గడ్డం రామకోటేశ్వర రావు, నల్లగొండ ప్రదీప్ తదితరులు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందచేశారు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.