
పంజాబ్ పోలీసులు తాజాగా ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్న ఓ నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి 4 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
అమృత్ సర్, మొహాలీలో స్టేట్ స్పెషల్ సెల్‌తో కలిసి కౌంటర్ వింగ్ ఆఫ్ పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించారు. నిందితుడి వద్ద నుంచి 4 గ్రనేడ్లతో పాటు రెండు విదేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పాక్ హ్యాండ్లర్లతో సంబంధం ఉన్న నిందితుడు వారి ఆదేశాల మేరకు ఉగ్ర కుట్రకు ప్రణాళిక రచిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఇటీవల చంఢీగడ్‌లో జరిగిన గ్రనేడ్ దాడికి, ఈ నిందితుడికి సంబంధం ఉన్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. అమృత్‌సర్‌లోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్‌లో కేసు నమోదైంది. నిందితుడికి ఇంకెవరితో అయినా సంబంధాలు ఉన్నాయా? అని గుర్తించేందుకు తదుపరి విచారణ చేపట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.





