
69views
మత విశ్వాసాలు, నమ్మకాలపై న్యాయస్థానాలకు లోతైన అవగాహన ఉండదని అఖిల భారతీయ సంత్ సమితి అభిప్రాయపడింది. అనాదిగా వస్తున్న మతాచారాలను మార్చేందుకు కోర్టులు ప్రయత్నించరాదని సూచించింది. కేరళంలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు ప్రవేశించరాదన్న ఆచారం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అని 2018 సెప్టెంబరులో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసింది. ఈ తీర్పును సమీక్షించాలని అఖిల భారతీయ సంత్ సమితి ్జకూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రివ్యూ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది.





