News

అరుణాచల్‌ప్రదేశ్‌లో 189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క

125views

అరుణాచల్‌ప్రదేశ్‌లో దాదాపు 189 సంవత్సరాల క్రితం స్థానికంగా లభించిన అరుదైన మొక్కజాతి ఇటీవల జరిపిన ఓ సర్వేలో మళ్లీ కనిపించింది. 19వ శతాబ్దం ప్రారంభంలో లోహిత్‌ జిల్లాలో జరిపిన సర్వేలో భాగంగా హెన్కెలియా మోనోఫిల్లా అనే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత కనుమరుగైన ఈ మొక్క, మళ్లీ బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇటీవల చేపట్టిన సర్వేలో కనిపించిందని అధికారులు తెలిపారు. గెస్నేరియాసి కుటుంబానికి చెందిన ఈ జాతి మొక్కలు సాధారణంగా తేమతో కూడిన అటవీ వాతావరణాల్లో దర్శనమిస్తాయి. భారతదేశంలో జీవవైవిధ్యం పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో నిరంతర సర్వేలు, సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు నొక్కిచెప్తున్నాయని వృక్షశాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ మొక్కను మళ్లీ ఆ ప్రాంతంలో కనుగొన్నందుకు గానూ ముఖ్యమంత్రి పెమా ఖండూ శాస్త్రవేత్తలను అభినందించారు.