
కుటుంబ ప్రబోధన్ 2008లో ప్రారంభమై, క్రమంగా వికసించింది. గత సంవత్సరం ఓంకారేశ్వర్‌లో జరిగిన బైఠక్‌లో పరమ పూజనీయ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ సమక్షంలో కుటుంబ ప్రబోధన్ ధ్యేయం వెల్లడైంది. మంగళ సంవాద్ మాధ్యమంగా ప్రతి కుటుంబంలో వ్యక్తిగత, పారివారిక,సామాజిక జీవనంలో లోకహితం కోసం కావలసిన పరివర్తనను సాధించాలి. ఇది రోజు మనం స్మరించుకోవాలి.
7. దృష్టి – కళ్లతో చూసేది సామాన్యమే భారతీయ జీవన దృష్టి, జీవన మూల్యాలు జీవన వ్యవహారం ఇవి ముఖ్యం. ప్రపంచంలో భారత దేశంలో మాత్రమే మాతృవత్ పరదారేషు, పరద్రవ్యై షు లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతేషు, యః పస్యతి సపండితః// అన్నారు. పర స్త్రీ తల్లితో సమానం అన్నారు. పరుల ధనం మట్టితో సమానం, అందరిని ఆత్మీయులుగా భావించడం ఇది మన సంస్కృతి. కేరళలో కాలడి నుండి బయలుదేరి శంకరాచార్యుల వారు వారణాసి వచ్చారు. అన్నపూర్ణ దర్శనం చేసుకుని అన్నపూర్ణాష్టకం రాశారు. ‘అన్నపూర్ణే సదాపూర్ణే, శంకర ప్రాణ వల్లభే! జ్ఞాన వైరాగ్య సిధ్య ర్ధం భిక్షాందేహీ చ పార్వతి, మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివ భక్తాశ్చ, స్వదేశో భువన త్రయం!మూడు భువనాల్లో ఉన్న శివభక్తులంతా నా సోదరులే అన్నారు. వివేకానందుడు sisters and brothers of America అన్నారు. ఈ మాట 1200 సంవత్సరాల క్రితమే శంకరులు చెప్పారు. రామతీర్థ జీవితంలోనూ ఇది ఉంది. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ విమానాశ్రయంలో దిగేదాకా ఆయనకు తెలియదు. ‘మీకు మిత్రులు ఎవరు ఉన్నారు’ అని ఒక అమెరికన్ అడిగాడు. ‘నాతో మాట్లాడిన నువ్వే నా మిత్రుడివి’ అన్నాడు రామతీర్థ.‘అలాగా అయితే నాతో మా ఇంటికి వస్తారా’ అని అడిగాడు అమెరికన్. ‘తప్పకుండా’ అంటూ అతని వెంట నడిచి వెళ్లారు రామతీర్థ. ఇలా అందరూ నా వాళ్లే అనుకోవడం, ఈ ఆత్మీయత వ్యవహారం ఇది భారతీయ దృష్టి.






