
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) హర్యానాలోని సమల్ఖా కేంద్రంగా మూడు రోజుల పాటు జరుగుతుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఈ నెల 13,14,15 తేదీల్లో జరుగుతాయని తెలిపారు. ఏబీపీఎస్ సమావేశాల నేపథ్యంలో ఆయన బుధవారం సమల్ఖాలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరెస్సెస్ లో నిర్ణయాలు తీసుకునే పరంగా ఇది అత్యంత కీలకమైన, అత్యున్నత సమావేశమని వివరించారు. ఈ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే ఆరెస్సెస్ సర్ సంఘచాలక్, సర్ కార్యవాహతో పాటు అఖిల భారతీయ సభ్యులు ఇప్పటికే సమావేశ స్థలానికి చేరుకున్నారని పేర్కొన్నారు.
ఈ నెల 13 న ఈ ప్రతినిధి సభల సందర్భంగా విలేకరులను ఉద్దేశించి సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే మాట్లాడుతారని, అఖిల భారతీయ ప్రతినిధి సభలో జరిగిన చర్చలను, అంశాలను మీడియాకి వివరిస్తారని తెలిపారు.
దేశ వ్యాప్తంగా యేటికి యేడాది సంఘ్ కి యువకులు ఆకర్షితులై, ఆరెస్సెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు.అలాగే సంఘ్ విస్తరిస్తున్న క్రమాన్ని కూడా వివరించారు. గత సంవత్సరంతో పోలిస్తే 6,000 కొత్త శాఖలు జరుగుతున్నాయని, అందులో ఎక్కువ మంది యువకులే వున్నారని పేర్కొన్నారు. Join RSS అన్న లింక్ తో ప్రతి యేడాది యువకులు, కొత్త వ్యక్తులు సంఘ్ తో కనెక్టివిటీలోకి వస్తున్నారన్నారు.
గత సంవత్సరం జనవరిలో 16,000 మంది చేరారని, ఈ సంవత్సరం 26,000 మంది చేరారని ఆయన పేర్కొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో ప్రారంభిక్ వర్గ, ప్రాథమిక వర్గలను కూడా నిర్వహించామని తెలిపారు. ఈ యేడాది కూడా సంఘ్ 97 శిక్షా వర్గలను నిర్వహిస్తుందని, వీటిలో 73 సంఘ శిక్షావర్గలు, కార్యకర్త వికాస వర్గలు, 40 ఏళ్లలోపు వారితో పాటు 40 నుంచి 65 ఏళ్ల లోపు వారు కూడా వుంటారని వివరించారు.
అలాగే ఈ సంవత్సరం శిరోమణి సంత్ రవిదాస్ 650 వ జయంతి కూడా వుందని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో యేడాది పాటు కొనసాగుతాయని తెలిపారు. ఆరెస్సెస్ స్వయంసేవకులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారని ప్రకటించారు.
మరో వైపు సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని సంబంధించిన కార్యక్రమాల ప్రదర్శనను కూడా సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దీనిని సహ సర్ కార్యవాహ కృష్ణగోపాల్ ప్రారంభించారు. ఇక.. సంఘ శయంతి కావున.. విజయదశమి ఉత్సవ్, గృహసంపర్క్ హిందూ సమ్మేళనం, యువజన సమావేశాలు, ప్రతిష్ఠిత వ్యక్తుల కార్యక్రమాలు, సామాజిక సమరసత లాంటి సమావేశాలపై కూడా ఆ సమావేశాల్లో చర్చ జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన అనుభవాలను కూడా సభ్యులు పంచుకుంటారు.
గృహసంపర్క్ అభియాన్‌లో ఇప్పటివరకు 10 కోట్లకు పైగానే ఇళ్లకు సంఘ్ చేరుకుందని అంబేకర్ ప్రకటించారు. ప్రతినిధి సభ 2025-2026 లో సంఘ కార్యకలాపాలు, కార్యక్రమాలను సమీక్షిస్తుందని, వివిధ ప్రాంతాలలో చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలపై నివేదికలను కూడా సభ్యులు సమర్పిస్తారని తెలిపారు.





